IPL 2022: చెన్నై-కోల్‌కతాల మధ్య మొదటి మ్యాచ్.. ఎక్కడ చూడాలో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రారంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. కోల్‌కతాకు శ్రేయాస్ అయ్యర్, చెన్నైకి రవీంద్ర జడేజా నాయకత్వం వహించనున్నారు. ఈ మ్యాచ్ మార్చి 26న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ ప్రారంభ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.00 గంటలకు టాస్ జరగనుంది. కాగా, మ్యాచ్ కవరేజీ సాయంత్రం 5.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కోల్‌కతా మరియు చెన్నై మధ్య జరిగే ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డి హిందీ, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1 హెచ్‌డిలో మ్యాచ్ వీక్షించే అవకాశం ఉంది. దీనితో పాటు స్టార్ నెట్‌వర్క్ బెంగాలీ, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో కూడా ప్రసారం చేస్తుంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 17 మ్యాచ్‌ల్లో చెన్నై గెలుపొందగా, కోల్‌కతా ఎనిమిది మ్యాచ్‌ల్లో మాత్రమే గెలవగలిగింది. అలాగే, ఒక మ్యాచ్ డ్రా ఐంది. ఇక IPL 2021లో, ఫైనల్ మ్యాచ్‌తో సహా రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి, ఇందులో CSK అన్ని మ్యాచ్‌లను గెలుచుకుంది.