Manoj Tiwari: బెంగాల్ క్రీడా శాఖ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మాజీ క్రికెటర్ మనోజ్ తివారి అసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఉదయం క్రికెట్ ఆడుతానని, సాయంత్రం తన శాఖకు సంబంధించిన ఫైళ్లను పనిశీలిస్తానని తెలిపారు. క్రీడా శాఖకు ఇంఛార్జి మంత్రి ఉండటంతో తనకు వెసులు బాటు లభిస్తోందన్నారు. తన బృందంలోని వ్యక్తులు ఎంతో ఉపయోక్తంగా ఉంటారని, వారికి రాత్రివేళల్లోనూ తాను ఫోన్ ద్వారా అందుబాటులో ఉంటానని మనోజ్ తివారీ వెల్లడించాడు. క్రికెట్ ఆడేటప్పుడు రాజకీయాల గురించి ఆలోచించనని స్పష్టం చేశాడు. అలాగే మంత్రిత్వ శాఖ పనులు పరిశీలించే సమయంలో క్రికెట్ గురించి ఆలోచించనని తెలిపారు.
మనోజ్ తివారీ ఇటీవల రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ, సెమీఫైనల్లో తొలి ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాది తనలో క్రికెట్ దాహం తీరలేదని చాటుకున్నాడు. గత ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన మనోజ్ తివారీ.. టీఎంసీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. క్రీడా కారుడు కావడంతో సీఎం మమతా బెనర్జీ అతడిని రాష్ట్ర క్రీడల మంత్రిగా నియమించారు. అయితే మంత్రి అయ్యాక కూడా మనోజ్ తివారీ క్రికెట్‌ను వదిలిపెట్టలేదు. మంత్రి పదవి ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. విపక్షాల నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కొంటూ, పరిపాలన సాగించాల్సి ఉంటుంది. రాజకీయ ఎత్తుగడలను చిత్తచేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది.