Brij Bhushan Harassment: బ్రిజ్ భూషణ్ వేధింపులపై విచారణ కమిటీ… మేరికోమ్ నేతృత్వం
Inquiry Committee on Brij Bhushan Harassment: మహిళా రెజ్లర్లపై డబ్లూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు ధిగారు. ఈ అంశం ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై ప్రధాని మోడీ సైతం స్పందించి కేంద్ర క్రీడాశాఖకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అటు జాతీయ మహిళా కమిషన్ కూడా దీనిపై విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా, దేశ వ్యాప్తంగా క్రీడాకారిణిలు దీనిపై స్పందించి బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ప్రముఖ బాక్సర్ మేరికోమ్ నేతృత్వం వహిస్తుంది. వేధింపుల అంశంపై విచారణ నిర్వహించి ఈ కమిటీ ఐఓఏకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మేరికోమ్ రిపోర్ట్ ఆధారంగా బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దేశంలోని రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజులపాటు ధర్నా నిర్వహించారు. ప్రముఖ అథ్లెట్ పీటీ ఉషా సైతం రెజ్లర్ల సపోర్ట్ చేస్తూ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అయితే, తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చెబుతున్నాడు. మరి కమిటీ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.