IndVsSA: సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం
IndVsSA 1st T20: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేయగా, స్వల్ప లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. 16.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ (51), సూర్యకుమార్ యాదవ్ (50) అజేయ అర్ధ సెంచరీలతో జట్టుకు విజయాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ మూడు పరుగులకే వెనుతిరిగాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, నోర్జ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది భారత్.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 106 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు గర్జించారు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై చెలరేగారు. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులే చేసింది. కేశవ్ మహరాజ్ (41 పరుగులు) టాప్ స్కోరర్ కావడం విశేషం. మార్‌క్రమ్ (25), పార్నెల్ (24) రన్స్ చేసారు.
అర్షదీప్ 3 వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ తీసాడు. ఈ విజయంతో భారత్ 1-0తో సిరీస్‌లో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య అక్టోబరు 2న రెండో టీ20 జరుగనుంది.