CWG 2022: భారత్ కు తొలి స్వర్ణం. మీరాబాయి సరికొత్త చరిత్ర
Meerabai Chanu Wins Gold: కామన్ వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. భారత వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారులు జోరు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే రెండు పతకాలు(రజతం, కాంస్యం) రాగా ఇప్పుడు స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను ఏకంగా స్వర్ణ పతకాన్ని గెలుచుకొని సరి కొత్త చరిత్రకు కారణమయ్యారు. 2018 కామెన్వెల్త్ క్రీడల్లో భారత్రు ఇదే మొదటి గోల్డ్ మెడల్. 49కేజీల విభాగంలో స్నాచ్‌లో లో 88 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీల బరువు ఎత్తి రికార్డు సృష్టించారు.
కామన్ వెల్త్ గేమ్స్ లో ఒకే రోజున భారత్ కు మూడు పతకాలు దక్కాయి. అంతకుముందు 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సార్గర్ రజత పతకం అందుకోగా.. 61కేజీలో విభాగంలో గురురాజ్ పూజారి కాంస్య పతకం సాధించారు. ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ 135 కేజీలు) ఎత్తి.. స్వర్ణానికి కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో మొదటి ప్రయత్నంలో 135 కేజీలు ఎత్తిన సర్గార్.. మిగిలిన రెండు ప్రయత్నాల్లో 139 కేజీలను ఎత్తలేకపోయాడు.
ఇక 61కేజీలో విభాగంలో బ్రాంజ్ మెడల్ అందుకున్న గురురాజ్.. మొత్తం 269కిలోల(118kg+151kg బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు. ఇతడు 2018 కామన్వెల్త్ క్రీడల్లో సిల్వర్ మెడల్ దక్కించుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో రజితం సాధించిన ఛాను పసిడి పతకం గెలవటంతో కామన్ వెల్త్ గేమ్స్ మొదలైన రెండో రోజునే భారత్ మూడు పతకాలను దక్కించుకుంది. బ్యాడ్మింటన్‌లో భారత జట్టు తొలి లక్ష్యం పూర్తయింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వరుసగా రెండో విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది.