ఆసియాకప్ 2023(Asia Cup 2023) టోర్నీ కోసం టీమిండియా(Team India) సమాయత్తమవుతోంది. ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.
Ishan Kishan : ఆసియాకప్ 2023(Asia Cup 2023) టోర్నీ కోసం టీమిండియా(Team India) సమాయత్తమవుతోంది. ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును భారత సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఆసియాకప్‌కు ఎంపికైన ఆటగాళ్లంతా బెంగళూరు(Bangalore) వేదికగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (head coach Rahul Dravid)పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ప్రాక్టీస్ క్యాంప్‌లో ముమ్మరంగా సాధన చేస్తున్నారు.
టీమిండియా తుది జట్టు ఎంపిక కోసం ఈ ప్రాక్టీస్ క్యాంప్‌ను టీమిండియా మేనేజ్మెంట్ వాడుకోనుంది. ఇప్పటికే ఆటగాళ్లకు సంబంధించిన యోయో టెస్ట్ పూర్తయ్యింది. ప్రతీ ఆటగాడి ఫిట్నెస్, ఫామ్‌ను టీమిండియా మేనేజ్మెంట్ నిశితంగా పరిశీలిస్తోంది. ఆటగాళ్ల బలహీనతలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఆసియాకప్‌లో భాగంగా టీమిండియా సెప్టెంబర్ 2న దాయాదీ పాకిస్థాన్‌తో తలపడనుంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూసే ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మ్యాచ్ తుది జట్టు ఎంపికపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెస్టిండీస్ పర్యటన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్ నేరుగా ఈ టోర్నీలో ఆడనున్నారు.
మహమ్మద్ షమీ అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో చివరిసారిగా ఆడాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాలతో 4 నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆసియాకప్ బరిలోకి దిగే తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్నెస్ సాధించలేదని, ఆరంభ మ్యాచ్‌లు అతను ఆడలేడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. దీంతో పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో అతనికి బదులు ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. అయితే ఇషాన్ కిషన్‌కు మిడిలార్డర్లో గొప్ప రికార్డు లేదు. అతన్ని ఏ స్థానంలో ఆడిస్తారనేది చర్చనీయంశంగా మారింది.
పాకిస్థాన్ లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ షా అఫ్రిదిని కట్టడి చేయాలనుకుంటే లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడించాలి. అప్పుడు శుభ్‌మన్ గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయనుండగా.. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా టాప్-7 బ్యాటర్లుగా బరిలోకి దిగనున్నారు. పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. పేస్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ పంచుకోనున్నారు. సిరాజ్‌ను ఆడించాలనుకుంటే శార్దూల్ ఠాకూర్ బెంచ్‌కే పరిమితమవుతాడు. శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రాకపోతే సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వస్తాడు. ఎక్స్ట్రా స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే అక్షర్ పటేల్ బరిలోకి దిగుతాడు.