SKY: ఉజ్జయిని ఆలయంలో సూర్య కుమార్ యాదవ్ ప్రార్ధనలు, ఎందుకో తెలుసా?
Indian cricketers Suryakumar Yadav, Kuldeep Yadav, and Washington Sundar visited Mahakaleshwar temple in Ujjain
టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్ ఉజ్జయిని ఆలయంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. కారు ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ సహచరుడు రిషబ్ పంత్ ఆరోగ్యం మెరుగుపడాలని భగవంతుడిని ప్రార్ధించారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయంలో ముగ్గురు క్రికెటర్లు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. బ్రహ్మ ముహుర్త సమయంలో ఉదయం 4 గంటలకు ఇచ్చే ఈ హారతిని బస్మ ఆరతి అని అంటారు. పూజారులు రెండు గంటల పాటు మంత్రాలు చదువుతూ హారతి కార్యక్రమం నిర్వహించారు.
భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర ఆలయంలో మాత్రమే భస్మ ఆరతి కార్యక్రమం చేపడతారు. ఎంతో పవిత్రంగా భావించబడే ఈ ఆరతి కార్యక్రమం చేపడితే కష్టాలు దూరమౌతాయని భక్తులు బలంగా విశ్వసిస్తారు.
విభూతితో చేసే ప్రత్యేక ఆరతి కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి రోజు ఉదయం ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మాఘ మాసం మూడో సోమవారం జరిపే పూజలకు మరింత విశిష్టత ఉంటుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
उज्जैन में महाकाल बाबा के दरबार में पहुंचे भारतीय क्रिकेट टीम के खिलाड़ी, क्रिकेटर ऋषभ पंत के जल्द स्वस्थ होने की लिए की प्रार्थना।#Ujjain #mahakal #kuldeepyadav #SuryakumarYadav pic.twitter.com/AfUhH9JNu9
— ब्राह्मण की बेटी (@PreetyShuklaJ) January 23, 2023