Holi Celebrations: హోలీ వేడుకల్లో మునిగి తేలిన భారత క్రికెటర్లు
Indian Cricketers celebrated Holi very grandly
దేశ వ్యాప్తంగా హోలీ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రంగుల పండుగను ఆనందోత్సహాలతో జరుపుకున్నారు. భారత క్రికెటర్లు కూడా హోలీ వేడుకలు ఘనంగా చేసుకున్నారు. అహ్మదాబాద్ చేరుకున్న ఆటగాళ్లందరూ రంగుల పండుగను ఎప్పుడూ లేనంతగా జరుపుకున్నారు.
నాల్గవ టెస్టు ఆడేందుకు అహ్మదాబాద్ చేరుకున్న భారత క్రికెటర్లు ప్రస్తుతం నరేంద్ర మోడీ స్టేడియంలోని డ్రెస్సింగ్ రూంలో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. సూర్య కుమార్ యాదవ్ పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తున్నాడు. ముఖం నిండా రంగులతో కనిపించిన సూర్య అక్కడ సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో జరిగాయో తెలియజేశాడు.
క్రికెట్ జట్టు సభ్యులందరూ టీమ్ బస్సులో ఎక్కిన తర్వాత సందడి మొదలయింది. కేరింతలతో కేక పుట్టించారు. విరాట్ కోహ్లీ సందడిని శుభ్మన్ గిల్ కెమెరాలో బందించాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రోహిత్ శర్మ వారిద్దరిపై రంగులు చల్లాడు. సందడి చేశాడు.
నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసిన అనంతరం టీమ్ బస్సులో ఎక్కిన భారత క్రికెటర్లు హోలీ మూడ్ లోకి వెళ్లిపోయారు. సందడి చేశారు. కేరింతలతో డాన్సులు చేశారు. విరాట్ కోహ్లీ సిల్ సిలా హిందీ సినిమాలో రంగ్ బరసే అనే పాటకు డాన్స్ చేశాడు. టీమిండియా కోచింగ్ స్టాఫ్ కూడా హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బీసీసీఐ ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసింది.