India Vs New Zealand: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్, ఛాహల్ కు దక్కని చోటు
India won the toss and elected to Field
శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ రాయ్ పుర్ లో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో మ్యాచ్ లో యజువేంద్ర చాహల్ కు చోటు దక్కలేదు. కులదీప్ యాదవ్ కు తుది జట్టులో స్థానం కల్పించారు.
రెండో వన్డేలో తుది జట్టులో స్థానం సంపాదించిన ప్లేయర్లు
రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్ధుల్ ఠాకుర్, కులదీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నారు.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ రాయ్ పుర్ లో షహీద్ వీర్ నారాయన్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగుతోంది. షహీద్ వీర్ నారాయన్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే తొలి వన్డే ఇదే కావడం విశేషం. గతంలో ఈ స్టేడియంలో 6 ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. కొన్ని స్థానిక మ్యాచులు కూడా జరిగాయి. మొట్ట మొదటి సారిగా ఓ వన్డే మ్యాచ్ జరగడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం.
అదే విధంగా భారత దేశంలో వన్డే మ్యాచులు జరిగిన స్టేడియంలు 49 ఉన్నాయి. ఆ జాబితాలో షహీద్ వీర్ నారాయన్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం కూడా జత కలిసింది. ఈ స్టేడియం వన్డేలను ఆతిధ్యం ఇస్తున్న 50వ స్టేడియం కావడం విశేషం.
🚨 Toss Update 🚨#TeamIndia win the toss and elect to field first in the second #INDvNZ ODI.
Follow the match ▶️ https://t.co/V5v4ZINCCL @mastercardindia pic.twitter.com/YBw3zLgPnv
— BCCI (@BCCI) January 21, 2023
A look at #TeamIndia's Playing eleven as we remain unchanged for the second #INDvNZ ODI👌🏻
Follow the match ▶️ https://t.co/V5v4ZINCCL @mastercardindia pic.twitter.com/ibbgWvzuUg
— BCCI (@BCCI) January 21, 2023