India Vs Australia: టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకున్న భారత్
India won the toss and elected to Bowl first
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం అయింది. తొలి వన్డే ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. కొన్ని అనివార్య కారణలతో తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్ అవకాశం దక్కించుకున్నాడు. భారత జట్టును తొలి వన్డేలో నడిపిస్తున్నాడు. తుది జట్టులో అక్షర్ పటేల్ కు స్థానం దక్కలేదు. రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత జట్టు బరిలో దిగింది.
జమ్ము కశ్మీర్ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్లో అవకాశం దక్కించుకోలేకపోయాడు. సిరాజ్, షమీలతో పాటు శార్ధుల్ ఠాకుర్ పేస్ విభాగంలో ఉన్నారు. కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు స్పిన్స్ భారం మోయనున్నారు. అక్షర్ పటేల్ కూడా స్థానం దక్కించుకోలేకపోయాడు.
తొలి వన్డేలో ఆడుతున్న భారత జట్టు
శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, షమీ, సిరాజ్, శార్ధుల్ ఠాకుర్ తొలి వన్డేలో ఆడుతున్నారు. రెండో వన్డేలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడంతో ఈక్వేషన్లు మారనున్నాయి.
🚨 A look at #TeamIndia's Playing XI for the first #INDvAUS ODI 🔽
Follow the match ▶️ https://t.co/BAvv2E8K6h @mastercardindia pic.twitter.com/UkfoRmxi02
— BCCI (@BCCI) March 17, 2023
..