India VS SL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, అర్షదీప్ కొనసాగింపు
India won the toss and elected to Bat First in the Rajkot match
శ్రీలంకతో జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచింది. బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఎటువంటి ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. రెండో టీ 20 మ్యాచ్‌లో ఆడిన జట్టే ఈ మ్యాచ్‌లో కూడా ఆడనుంది. అర్షదీప్‌ను తప్పించి హర్షల్ పటేల్‌కు ఛాన్స్ ఇస్తారని చాలా మంది భావించినా అది జరగలేదు. అర్షదీప్ వైపే హార్ధిక్ మొగ్గు చూపాడు.
సొంత గడ్డపై ఆడుతున్న హార్ధిక్ పాండ్యాపై అందరి చూపు నిలిచింది. ఓ భారీ ఇన్నింగ్స్ ఆడితే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. మొదటి రెండు మ్యాచుల్లోనూ హార్ధిక్ పాండ్యా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. రాజ్‌కోట్‌లో తన సత్తా చాటి అభిమానులను అలరిస్తాడా లేదా అనేది కొన్ని గంటల్లోనే తేలనుంది.
మరోవైపు శ్రీలంక జట్టు కూడా మంచి ఊపు మీద ఉంది. గత ఏడాది ఆసియా కప్ విజేతగా నిలిచిన లంక జట్టు ఆదే ఊపును ప్రస్తుతం కొనసాగిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో లంక జట్టు పటిష్టంగా ఉంది. ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణిస్తున్నారు
#TeamIndia have won the toss and elect to bat first in the third and final T20I.
We go in with an unchanged Playing XI.
Live – https://t.co/bY4wgiSvMC #INDvSL @mastercardindia pic.twitter.com/SDfhNlastc
— BCCI (@BCCI) January 7, 2023