India Vs SL: టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, చెలరేగుతున్న ఓపెనర్లు
India won the toss and elected to Bat First in the 3rd ODI against Sri Lanka
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించింది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్, నామ మాత్రపు మూడో మ్యాచ్ లో కొన్ని మార్పులతో బరిలో దిగింది. వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్ లను కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులోకి తీసుకున్నాడు.మూడో మ్యాచ్ కి హార్ధిక్ పాండ్యాకు విశ్రాంతి కల్పించాడు.
మొదట్లో కాస్త నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన వీరిద్దరూ ఆ తర్వాత చెలరేగి ఆడుతున్నారు. ఆరో ఓవర్ లో ఏకంగా 23 రన్స్ స్కోర్ చేశారు. 6వ ఓవర్ మొదటి బంతిని సిక్స్ కొట్టిన రోహిత్ శర్మ ఆ తర్వాత బంతికి సింగిల్ తీశారు. ఆ తర్వాతి నాలుగు బంతులను ఎదుర్కొన్న శుభ్ మన్ గిల్ వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. వీర విహారం సృష్టించాడు.
14 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత స్కోర్ 88 పరుగులకు చేరింది. హసరంగా బౌలింగ్ కి దిగడంతో బ్యాటింగ్ లో జోరు తగ్గింది. హసరంగా భారత ఓపెనర్లను కట్టడి చేస్తున్నాడు.
#TeamIndia Captain @ImRo45 wins the toss and elects to bat first against Sri Lanka in the third and final ODI.
Washington Sundar and Suryakumar Yadav come in to the XI.
Live – https://t.co/muZgJH3f0i #INDvSL @mastercardindia pic.twitter.com/4TNIPSezrI
— BCCI (@BCCI) January 15, 2023