IND vs WI 3 ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
India Won the Toss: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ ఆఖరి మ్యాచ్ జరగనుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పుడు జరుగుతున్న చివరి మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని విండీస్ టీమ్ భావిస్తోంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా అనుకున్నట్లే బౌలర్లలో మార్పులు చేసింది సెకండ్ వన్డేలో దారుణంగా విఫలమైన ఆవేశ్ ఖాన్‌ను తుది జట్టులో నుంచి తప్పించిన మేనేజ్మెంట్.. అతడి స్థానంలో మళ్లీ ప్రసిధ్ కృష్ణకు అవకాశం ఇచ్చింది. మరోవైపు జట్లు వివరాలు పరిశీలిస్తే
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిధ్ కృష్ణ
వెస్టిండీస్: షై హోప్, బ్రాండన్ కింగ్, కీసీ కార్టే, బ్రూక్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), కైల్ మయేర్స్, జాసన్ హోల్డర్, కీమో పాల్, అకీల్ హోసీన్, హేడెన్ వాల్ష్, జయ్డెన్ సీలెస్