IND vs NZ : టాస్ గెలిచిన భారత్.. తొలుత బ్యాటింగ్..అభిమానుల హంగామా
IND vs NZ Rohit Sharma won the toss, chose to bat first: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం అభిమానులతో నిండిపోయింది. క్రికెట్ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ హీరోల కోసం భారీగా తరలి వచ్చారు. టీమిండియాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ స్టేడియం హోరెత్తిస్తున్నారు. భారత్ – న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో హైదరాబాదీ ప్లేయర్ సిరాజ్ సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా మారారు. న్యూజీలాండ్ ప్రపంచ కప్ ముందు సన్నాహక సిరీస్ గా దీనిని భావిస్తోంది. న్యూజిలాండ్ 13 ఏళ్ల తర్వాత కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీ లేకుండా వన్డేల్లోకి దిగనుంది. చివరిసారిగా ఇది డిసెంబర్ 2010లో జరిగింది.
మూడు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేయగలిగితే వన్డే ప్రపంచ ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానానికి చేరుతుంది. తాము బలమైన టీంతో తల పడుతున్నామనే సంగతి తెలుసని టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు. ఇప్పటికే రెండు జట్లు పిచ్ ను పరిశీలించి తమ తుది జట్లు ఖరారు చేసాయి. టీమిండియా నుంచి ప్లేయింగ్ XI లో రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (w), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ ఉన్నారు. న్యూజిలాండ్ టీంలో అలెన్, కాన్వాయ్, మిచెల్, నిఖోలస్, లథమ్, ఫిలిప్స్, బ్రేస్ వెల్, శాంటర్, శిప్లే, ఫ్రెగ్యూసన్ , టిక్నర్ ను ఎంపిక చేసారు. భారత్ ను 300 పరుగుల లోగా పరిమితం చేస్తే కివీస్ కు విజయవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.