India Vs SL: మూడో టీ 20లో భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం
India won the third T 20 Match by 91 runs, lifts the Series
శ్రీలంకతో జరిగిన టీ 20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. 2-1 తేడాతో హార్ధిక్ సేన సిరీస్ గెలిచింది. కీలకమైన మూడవ టీ 20 మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని సాధించడంలో లంక జట్టు చతికిల పడింది. 137 పరుగులకే లంక జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో లంక జట్టు ఓటమి పాలయింది.
అర్షదీప్ సింగ్ 3 వికెట్లు, హార్ధిక్ పాండ్యా, చాహల్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. మొదటి 7 వికెట్లు ఫీల్డర్లు క్యాచులు పట్టడం ద్వారానే వికెట్లు పడ్డాయి. శివం మావీ రెండు క్యాచులు పట్టాడు. ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్, శుభ్‌మన్ గిల్, అక్షర్ పటేల్, దీపక్ హుడాలు ఒక్కొక్క క్యాచ్ పట్టారు.
శ్రీలంక వికెట్ల పతనం
మొదటి వికెట్: కుషాల్ మెండిస్
రెండవ వికెట్: నిస్సంక
మూడవ వికెట్: ఫెర్నాండో
నాల్గవ వికెట్: అసలంక
ఐదవ వికెట్: డి సిల్వ
ఆరవ వికెట్: హసరంగ
ఏడవ వికెట్: కరుణ రత్నే
ఎనిమిదవ వికెట్: తీక్షణ
తొమ్మిదవ వికెట్: షనక
పదవ వికెట్: మధుషంక
భారత జట్టు 228 పరుగులు
టాస్ గెలిచి తొలిత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 228 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ వీరవిహారం చేశాడు. కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 9 సిక్సర్లు 7 బౌండరీలు బాదాడు. టాపార్డర్‌లో రాహుల్ త్రిపాఠీ 35 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ 46 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన అక్షర్ పటేల్ కూడా చెలరేగి ఆడాడు. కేవలం 9 బంతుల్లో 4 ఫోర్లు కొట్టి 21 పరుగులు చేశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
No surprises there as @surya_14kumar is adjudged Player of the Match for his scintillating unbeaten century in the 3rd T20I. 👏🏾🫡⭐️
Details – https://t.co/AU7EaMxCnx #INDvSL #TeamIndia @mastercardindia pic.twitter.com/bbWkyPRH4m
— BCCI (@BCCI) January 7, 2023
A 91-run win and a series victory for India in Rajkot!#INDvSL | 📝Scorecard: https://t.co/v6DELbUa9F pic.twitter.com/xnh2ZFOcB5
— ICC (@ICC) January 7, 2023
Arshdeep Singh picks up the final wicket of the innings as #TeamIndia win by 91 runs and clinch the series 2-1.
This is also India's 25th bilateral series win against Sri Lanka in India.#INDvSL @mastercardindia pic.twitter.com/AT7UyqA6hf
— BCCI (@BCCI) January 7, 2023