India Vs NZ: రెండో వన్డేలో భారత్ ఘన విజయం, 2-0 తేడాతో సిరీస్ కైవసం
India won the ODI Series with NZ by 2-0
న్యూజిలాండ్ లో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో కివీస్ జట్టును ఓడించింది. 109 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు 20.1 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 51 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. శుభ్ మన్ గిల్ 40 పరుగులు చేశాడు. చివరి వరకు అజేయంగా నిలిచాడు. ఇషాన్ కిషన్ తో కలిసి చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా భారత జట్టు వన్డే సిరీస్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది.
ఈ ఏడాదిలో రోహిత్ శర్మ బ్యాటింగ్ తీరు పూర్తిగా మారిపోయింది. మంచి ఎటాకింగ్ బ్యాటింగ్ చేస్తూ పాత రోహిత్ శర్మను గుర్తుకు తెస్తున్నాడు. బౌండరీలు, భారీ సిక్సర్లతో పరుగుల వరద పారిస్తున్నాడు. రెండో వన్డేలోను అదే జోరు కొనసాగించాడు. 50 బంతుల్లో 51 పరుగులు చేశాడు. రోహిత్ శర్మకు ఇది 48వ అర్ధశతకం కావడం విశేషం.
FIFTY for @ImRo45 – his 4⃣8⃣th ODI half-century 💪 💪#TeamIndia captain is leading the charge with the bat in the chase. 👏 👏
Follow the match ▶️ https://t.co/tdhWDoSwrZ #INDvNZ | @mastercardindia pic.twitter.com/q7F69irCDq
— BCCI (@BCCI) January 21, 2023
భారత విజయంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నకెప్టెన్ రోహిత్ శర్మ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. పదునైన బౌలింగ్ ఎటాక్ చేశారు. కివీస్ బ్యాటర్లను కుదురుకోకుండా చేశారు. 15 పరుగులకే 5 కీలక వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ జట్టును కోలుకోలేని దెబ్బ తీశారు. అక్కడ నుంచి పరుగులు చేయడంతో వెనకబడ్డ కివీస్ జట్టు చివరికి 108 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ రెండే వికెట్లు దక్కించుకున్నారు. మహ్మద్ సిరాజ్, శార్ధుల్ ఠాకుర్, కులదీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. 6 పరుగుల వ్యవధిలోనే చివరి 4 వికెట్లు పడిపోయాయి. 102 పరుగులకు 6 వికెట్లు మాత్రమే కోల్పోయిన కివీస్ జట్టు 108 పరుగులకు ఆలౌట్ అయింది. గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రాస్ వెల్, మిచెల్ సాంట్నర్ కొంతలో కొంత భారత బౌలర్లను ఎదుర్కోగలిగారు. రెండంకెల స్కోర్ చేశారు.
.@ShubmanGill finishes things off in style! #TeamIndia complete a comprehensive 8️⃣-wicket victory in Raipur and clinch the #INDvNZ ODI series 2️⃣-0️⃣ with more game to go 🙌🏻
Scorecard ▶️ https://t.co/tdhWDoSwrZ @mastercardindia pic.twitter.com/QXY20LWlyw
— BCCI (@BCCI) January 21, 2023