IND Vs NZ : న్యూజీల్యాండ్ ను మట్టికరిపించి వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్‌గా భారత్!
IND Vs NZ : ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్ ఈ రోజు ఆసక్తికరంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించడంతో సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ న్యూజిలాండ్ ముందు 386 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక 386 పరుగుల టార్గెట్ తో కివీస్ జట్టు కేవలం 295 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్‌పై భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో కివీస్‌ను టీమిండియా క్లీన్‌ప్ చేసింది.
యుజ్వేంద్ర చాహల్ వేసిన బంతికి సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఇక ఈ మ్యాచ్ లో సాంట్నర్ 29 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత జట్టు వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఇక మీదట రాంచీలో జనవరి 27న ప్రారంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక ఈ విజయంతో టీమ్ ఇండియా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు 386 పరుగుల లక్ష్యం ఉండగా, కివీస్ జట్టు 41.2 ఓవర్లలో కేవలం 295 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ తరఫున డ్వేన్ కాన్వే అద్భుత సెంచరీ ఆడినా, జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. డ్వేన్ కాన్వే 100 బంతుల్లో 138 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.