India wins: మూడో వన్డేలో భారత్ ఘన విజయం, చతికిలపడ్డ బంగ్లాదేశ్
India wins third one day Match by 227 runs
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 227 పరుగుల తేడాతో గ్రాడ్ విక్టరీ అందుకుంది. 410 పరుగుల లక్ష్యంతో బరిలోదిగిన బంగ్లాదేశ్ కేవలం 182 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.
భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా జట్టు భారత్ ముందు తలవంచింది. 73 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు మరో 100 పరుగులు చేసేలోగా మొత్తం వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో శార్ధూల్ ఠాకుర్ 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 2 వికెట్లు, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు పడగొట్టారు. మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్‌లకు ఒక్కక్క వికెట్ దక్కింది.
తొలిత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏకంగా 409 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, కోహ్లీ సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. డబుల్ సెంచరీతో చిచ్చరపిడుగు వలే చెలరేగిన ఇషాన్ కిషన్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మొదటి రెండు వన్డేలలో గెలిచిని బంగ్లాదేశ్ చివరివన్డేలో ఘోరంగా విఫలం చెందింది. ఈ వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బంగ్లా బ్యాటర్ మెహదీ హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.
India record their third-biggest win by margin of runs in men's ODIs 🙌#BANvIND | https://t.co/SRyQabJ2Sf pic.twitter.com/qSEFljYepH
— ICC (@ICC) December 10, 2022
.@imShard scalped 3⃣ wickets and was our top performer from the second innings of the third #BANvIND ODI 👍 👍 #TeamIndia
Here's his bowling summary 🔽 pic.twitter.com/QqN7gelfXM
— BCCI (@BCCI) December 10, 2022
For his fiery 🔥 🔥 double ton, @ishankishan51 bags the Player of the Match award as #TeamIndia beat Bangladesh by 227 runs in the third ODI 👏 👏
Scorecard 👉 https://t.co/HGnEqugMuM #BANvIND pic.twitter.com/CJHniqrIoa
— BCCI (@BCCI) December 10, 2022
India wins