India VS SL: తొలి వన్డేలో భారత్ గెలుపు, 67 రన్స్ తేడాతో లంక ఓటమి
India wins by 67 runs in the First ODI against Sri Lanka
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు గెలిచింది. 67 పరుగుల తేడాతో లంక జట్టును ఓడించింది. రోహిత్ సేన 373 పరుగులు చేయగా, లంకేయులు 306 పరుగులు చేశారు. శనక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 108 పరుగులు చేశాడు. శ్రీలంక జట్టు ఓడినా అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఘోర పరాజయం ఎదురుకాకుండా కెప్టెన్ శనక జాగ్రత్తగా ఆడాడు. చివరి వరకు ఆడి అజేయంగా నిలిచాడు.
లంక ఆటగాళ్లో నిస్సంక 72 పరుగులు, డిసిల్వ 47 పరుగులు చేశారు. వీరు తప్ప మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు. ఒక పక్క వికెట్లు పడుతున్నా.. కెప్టెన్ శనక ఒక్కడే భారత బౌలర్లను వీరోచితంగా ఎదుర్కొన్నాడు. ఒక దశలో లంక జట్టు 50 ఓవర్లు పూర్తిగా ఆడుతుందా అనే సందేహం కలిగింది. అటువంటి అనుమానాలను.. శనక పటాపంచలు చేశాడు. మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. శతకం సాధించాడు. జట్టు పరువు నిలబెట్టాడు. ఓటమి తప్పించుకోలేకపోయినా…పరువు కాపాడగలిగాడు.
టీమిండియా 373 రన్స్
తొలిత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏకంగా 373 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ వీరవిహారం చేశాడు. సెంచరీతో కదం తొక్కాడు. 113 పరుగులు చేశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్బుతంగా ఆడి జట్టుకు గట్టి పునాది వేశారు. రోహిత్ శర్మ 80 పరుగులు, గిల్ 70 పరుగులు చేశారు. వీరు ఔటైన తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 39 పరుగులు, హార్ధిక్ పాండ్యా 14, అక్షర్ పటేల్ 9 పరుగులు చేశారు. మొత్తంగా 50 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత జట్టు 373 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి మహ్మద్ షమీ 4 పరుగులతోను, మహ్మద్ సిరాజ్ 7 పరుగులతోను నాటౌట్‌గా నిలిచారు.
That's that from the 1st ODI.#TeamIndia win by 67 runs and take a 1-0 lead in the series.
Scorecard – https://t.co/262rcUdafb #INDvSL @mastercardindia pic.twitter.com/KVRiLOf2uf
— BCCI (@BCCI) January 10, 2023
For his stupendous knock of 113 off 87 deliveries, @imVkohli is adjudged Player of the Match as #TeamIndia beat Sri Lanka by 67 runs.
Scorecard – https://t.co/MB6gfx9iRy #INDvSL @mastercardindia pic.twitter.com/ecI40guZuB
— BCCI (@BCCI) January 10, 2023
First T20I of 2023 ✅
First ODI of 2023 ✅🇮🇳 go 1 up in the series. And it's an early birthday gift for the head coach. 😉
📸: BCCI#PlayBold #TeamIndia #INDvSL pic.twitter.com/bs3hbrTdwb
— Royal Challengers Bangalore (@RCBTweets) January 10, 2023