India Vs SL: రెండో వన్డేలో భారత్ విజయం, జట్టును గెలిపించిన కేఎల్ రాహుల్
India wins by 4 wkts in the second One day
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో 40 బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు లక్ష్యాన్ని చేరుకుంది. శ్రీలంక జట్టు 215 పరుగులు చేయగా, భారత జట్టు 219 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్ చివరి వరకు నిలిచి భారత్ గెలుపుకు దోహదం చేశాడు.కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాతో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 103 బంతులను ఎదుర్కొని 64 పరుగులు చేశాడు. సిక్సుల జోలికి వెళ్లకుండా బౌండరీలపైనే ఫోకస్ పెట్టాడు.
86 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో కేఎల్ రాహుల్ బరిలో ఉన్నాడు. జట్టును గెలిపించే బాధ్యత తనపై వేసుకున్నాడు. రిస్కీ షాట్లు ఆడకుండా జాగ్రత్తగా ఆడాడు. జట్టు స్కోర్ ను నెమ్మదిగా పెంచుతూ పోయాడు. పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు.
రెండో వన్డేలో భారత విజయం వెనక బౌలర్లు కూడా కీలక పాత్ర పోషించారు. కులదీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. చెరో 3 వికెట్లు పడగొట్టారు. లంక జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. తక్కువ లక్ష్యంతో బరిలో దిగిన భారత బ్యాటర్లు ఒత్తిడి లేకుండా ఆడారు.
A victory by 4️⃣ wickets for #TeamIndia in the second #INDvSL ODI here in Kolkata and the series is sealed 2️⃣-0️⃣ 👏👏
Scorecard ▶️ https://t.co/jm3ulz5Yr1 @mastercardindia pic.twitter.com/f8HvDZRJIY
— BCCI (@BCCI) January 12, 2023