India vs Sri Lanka: సిరీస్‌పై కన్నేసిన భారత్
India vs Sri Lanka: తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా.. ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీతో కదం తొక్కగా.. రోహిత్, శుభ్‌మన్ అర్ధసెంచరీలతో మెరిసారు. టాపార్డర్ రాణించడంతో భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందుంచగలిగింది. శ్రేయస్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కూడా రాణిస్తే ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారడం ఖాయం. రోహిత్ శర్మ తన ఫేవరెట్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో మరింతగా చెలరేగే అవకాశం ఉందని అనిపిస్తుంది.
కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండోవన్డేకు ఇరుజట్లు మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశముంది. మరోవైపు శ్రీలంక కెప్టెన్ శనక మినహా మిగతా బ్యాటర్స్ నిరాశపరుస్తున్నారు. అలాగే ఫీల్డింగ్ లో లంక ఆటగాళ్లు విఫలమయ్యారు. కోహ్లీ క్యాచ్ ను రెండుసార్లు వదిలేయడంతో పాటు బౌండరీల వద్ద పలుసార్లు బాల్‌ను అడ్డుకోవటంలో విఫలమయ్యారు. ఇక నేడు ఉత్కంఠ పోరులో ఈ రెండవ వన్డే జరుగనుంది.