India vs Sri Lanka: శ్రీలంకతో భారత్ తొలిపోరు నేడే
India vs Sri Lanka: ఇండియా-శ్రీలంక జట్ల మధ్య నేడు తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అలాగే, కోహ్లీ, కేఎల్ రాహుల్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక టీ 20 సిరీస్ విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే నేడు గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటకు మెుదలవుతుంది. యువకులతో భారత్ జట్టు బరిలో నిలవనుంది. వన్డే మ్యాచులలో సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతూకంగా కనిపిస్తోంది.
ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా మాత్రం గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. తొలి వన్డేలో శుభ్‌మన్ ఆడుతున్నాడని కెప్టెన్ రోహిత్ ఇప్పటికే పేర్కొన్నాడు. దీంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ క్రిజ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. భారత్, శ్రీలంక జట్లు మొత్తం 162 వన్డేల్లో తలపడ్డాయి. వన్డే సమరంలోనూ భారత జట్టు పైచేయి సాధించింది. భారత్ 93 మ్యాచ్‌లు గెలుపొందగా, శ్రీలంక 57 మ్యాచ్‌లు గెలిచింది. 11 మ్యాచ్‌ల్లో ఫలితం లేకపోగా, ఒక మ్యాచ్ టై అయింది.
అస్సాం క్రికెట్ సంస్థ.. అస్సాం ప్రభుత్వం ఈ మ్యాచ్‌కు పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్‌కు రద్దీ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు కామ్‌రూప్ జిల్లా ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలు, ప్రైవేట్ సంస్థలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది.
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (కీపర్), , హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్,శ్రేయాస్ అయ్యర్ / సూర్యకుమార్ యాదవ్
శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (కీపర్), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, లహిరు కుమార, జెఫ్రీ వాండర్సే.