Ind Vs SA: నేటి నుంచి వన్డే సీరిస్…
Ind Vs SA: టీ 20 వరల్డ్ కప్‌కు ముందు భారత్ జట్టు సౌతాఫ్రికాతో టీ 20, వన్డే సీరిస్‌ను అడుతున్నది. టీ 20 సీరిస్‌ను 2-1 తేడాతో భారత్ జట్టు కైవసం చేసుకున్నది. కాగా, నేటి నుంచి వన్డే సీరిస్ ప్రారంభం అవుతున్నది. భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఈరోజు మొదటి వన్డే మ్యాచ్ ప్రారంభం కానున్నది. లక్నో వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరుగుతున్నది. అయితే, రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ జట్టు ఈ సీరిస్ లో పాల్గొనకుండా నేరుగా టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా వెళ్లింది.
కాగా, శిఖర్ ధావన్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టు సౌతాఫ్రికాతో తలపడుతున్నది. ద్వితీయశ్రేణి జట్టు అయినప్పటికీ సౌకాఫ్రికాపై విజయం సాధించి తీరుతామని కెప్టెన్ శిఖర్ ధావన్ ఆశాభావం వ్యక్తం చేశారు. విండీస్, జింబాబ్యే సీరిస్‌లలో అదరగొట్టిన శుభమ్ గిల్ సౌతాఫ్రికా సిరిస్‌తో ఓపెనర్‌గా క్రీజ్‌లోకి దిగనున్నాడు. సౌతాఫ్రికాతో తలపడనున్న భారత జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రజిత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, సంజు శాంసన్ (వికెట్), షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్