IND VS SA: నేడు ఇండియా సౌతాఫ్రికా మూడో టీ20
IND VS SA: ఇండియా- సౌతాఫ్రికా జట్ల మధ్య చిట్ట చివరి టీ 20 మ్యాచ్‌నేడు జరుగనుంది. ఇప్పటికే ఈ సీరిస్ ను 2-0 తేడాతో గెలిచిన టీమిండియా.. క్లీన్ స్వీప్ చేయాలని ఆతృతగా ఉంది. ఈ నేపథ్యంలోనే నేడు మూడో టీ20లో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఇండోర్ స్టేడియం వేదిక కానుంది.
మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. దీంతో మూడో వన్డేలో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగి ప్రయోగాలు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని టీమిండియాలో ప్రయోగాలు చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో పెద్దగా ప్రాధాన్యం లేని మూడో టీ20కి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.
సోమవారం ఉదయమే గౌహతి నుంచి నేరుగా ముంబై వెళ్లిపోయాడు. మిగిలిన టీమ్ మూడో టీ20 కోసం ఇండోర్ వెళ్లింది. ఈ మ్యాచ్ నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. మంగళవారం (అక్టోబర్ 4) ఇండియా, సౌతాఫ్రికా మధ్య ఇండోర్‌లో చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈమ్యాచ్‌కు కోహ్లి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు తుది జట్టులో చోటు దక్కనుంది. అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఈ నెల 6న ఇండియన్ టీమ్ ఆస్ట్రేలియా వెళ్లనుంది.