IND vs PAK:నేడే దాయాదిల పోరు
IND vs PAK: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో నేడు రసవత్తర పోరు జరగనుంది. దాయాది జట్లైన భారత్ – పాకిస్థాన్ జట్లు నువ్వానేనా అన్నట్లుగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. మెల్‌బోర్న్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా ఇరుజట్లు తమతమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. అయితే, ఈ మ్యాచ్ కు వర్షంముప్పు పొంచిఉంది. ఆదివారం మెల్‌బోర్న్ ప్రాంతంలో జల్లులు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు పాక్ – భారత్ పోరులో మహ్మద్ షమీని బరిలోకి దింపుతారా లేదా అనేది ఆసక్తి గా మారింది. గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ నుండి షమీ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడలేదు. కానీ గత నాలుగురోజుల క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చివరిలో ఒక్క ఓవర్ వేసి అద్భుత ప్రదర్శనను షమీ కనబర్చాడు. చివరి ఓవర్లలోనైనా బౌలింగ్ చేయగలడు. అయితే పత్యర్థి జట్టు బ్యాటర్ల పరుగుల ప్రవాహాన్ని నియంత్రించడంలో షమీ ఏ మేరకు విజయం సాధిస్తాడనేది ప్రశ్నగా మారింది.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), దినేష్ కార్తీక్ , KL రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్.
పాకిస్తాన్ : బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ , షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హైదర్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది.