India Vs NZ: మూడో వన్డేలో రెండు మార్పులతో బరిలో దిగిన రోహిత్ సేన
India Vs NZ 3rd ODI in Holkar stadium in Madhya Pradesh
టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిని కివీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇప్పటికే సిరీస్ ను 2-0 తేడాతో ముందంజలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలో దిగింది. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు విశ్రాంతి కల్పించింది. ఉమ్రాన్ మాలిక్, యజువేంద్ర చాహల్ కు తుది జట్టులో స్థానం కల్పించింది.
ఈ ఏడాది టీమిండియా క్రికెట్ జైత్రయాత్ర కొనసాగుతోంది. కొత్త ఏడాది ప్రారంభంలో శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్, టీ 20 సిరీస్ లను భారత్ కైవసం చేసుకుంది. కివీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా క్లీన్ స్వీప్ అవుతుందా లేదా అనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది.
మధ్యప్రదేశ్ లోని హోల్కార్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు గెలిస్తే, వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంది. వన్డే సిరీస్ ను 3-0 తేడాతో నెగ్గితే ఆ అవకాశం భారత జట్టుకు దక్కనుంది.
భారత బ్యాటింగ్ ఆర్డర్ ఇటీవల కాలంలో మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. వారితో పాటు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యాలు కూడా పరుగుల వరద పారిస్తున్నారు. బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వీరితో పాటు ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, శార్ధుల్ ఠాకుర్ కూడా జట్టుకు అండగా నిలుస్తున్నారు.
🚨 Toss Update 🚨
New Zealand win the toss and elect to field first in the third #INDvNZ ODI.
Follow the match ▶️ https://t.co/ojTz5RqWZf…#TeamIndia | @mastercardindia pic.twitter.com/S1V3NmNnmp
— BCCI (@BCCI) January 24, 2023
🚨 Team Update 🚨
Two changes in the side as Umran Malik & Yuzvendra Chahal are named in the eleven.
Follow the match ▶️ https://t.co/ojTz5RqWZf…#TeamIndia | #INDvNZ | @mastercardindia pic.twitter.com/ifXMk5NO4H
— BCCI (@BCCI) January 24, 2023
India Vs NZ