3rd ODI India vs NZ: కివీస్‌తో భారత్ ఆఖరి వన్డే నేడు
3rd ODI India vs NZ: శ్రీలంకతో ఆడి సిరీస్ గెలుచుకున్నటీమిండియా మరో సిరీస్ ను సొంతం చేసుకుంది. వరుస విజయాలతో టీమిండియా దూసుకెళ్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి రెండు వన్డేల్లో టీమిండియా గెలిచి సిరీస్ ను దక్కించుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ ను క్లిన్ స్వీప్ చేయాలని చూస్తుంది. నేడు న్యూజిలాండ్‌తో జరిగే మూడో, చివరి వన్డేకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందుకు ఇండోర్ వేదికైంది. తొలి వన్డేలో గట్టి పోటీనిచ్చిన కివీస్ రెండో మ్యాచ్‌లో పేలవ ఆటతీరుతో కప్పును భారత్ కు అప్పజెప్పింది. ఇకనేడు ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరుగనుంది.
న్యూజిలాండ్ కనీసం ఆఖరి వన్డేలోనైనా గెలవాలని భావిస్తోంది. కానీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎంతో బలంగా ఉన్న భారత్‌ను ఓడించడం కివీస్‌కు అనుకున్నంత తేలికేం కాదనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు,బౌలర్లు మెరుగ్గా రాణిస్తేనే కివీస్ సేనకు గెలుపు అవకాశాలున్నాయి. ఇక టీమిండియా లో ఓపెనర్లు గిల్, రోహిత్,విరాట్ మాత్రమే నిలకడగా ఆడుతున్నారు. ఇషాన్, సూర్యకుమార్, హార్దిక్ క్రీజులో నిలిచేందుకు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంది. ఇక శుభమున్ గిల్, రోహిత్‌లు మరోసారి విజృంభిస్తే టీమిండియా భారీ స్కోరు కష్టమేమీ కాదు.
ఇక రెండో మ్యాచ్‌లో కివీస్ పూర్తిగా చేతులెత్తేసింది. ఇక్కడ బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటర్లు మెరుగ్గా రాణించక తప్పదు. కాన్వే, అలెన్‌లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్ కనబరచలేక పోతున్నారు. సాంట్నర్, బ్రాస్‌వెల్ మాత్రమే విజృభిస్తూ ఆడుతున్నారు. ఇక ఈ మ్యాచులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తుంది న్యూజిలాండ్ జట్టు.