IND vs BAN : నేడు భారత్-బంగ్లా చివరి వన్డే
IND vs BAN : భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే నేడు ఉదయం 11.30 గంటల నుంచి జరగనుంది. బంగ్లాతో జరిగిన మొదటి రెండు వన్డేల్లో భారత్ జట్టు పరాజయం పాలవగా, రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. అలాగే డిసెంబర్ 14-18, 22-26 మధ్య రెండు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ గాయంతో పాటుగా, బంగ్లాదేశ్ తో మూడో వన్డే కోసం భారత్ జట్టులో చోటుచేసుకున్న మార్పులపై బీసీసీఐ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ చివరిదైన భారత్- బంగ్లాదేశ్ మూడో వన్డే మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. బంగ్లాదేశ్ తో మూడో వన్డేకి కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కుల్దీప్ యాదవ్ ను చివరి వన్డే కోసం భారత జట్టులో చేర్చింది. గాయంతో బాధపడుతున్న కుల్దీప్ సేన్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడని తెలిపారు. మరో ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా 2వ వన్డే సమయంలో ఎడమ హార్మస్టింగ్ స్ట్రెయిన్‌తో బాధపడడంతో, అతను కూడా సిరీస్‌కు దూరమయ్యాడు. రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది.
నేడు బరిలో కి దిగనున్న భారత్ జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్) (వికెట్ కీపర్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.