India vs Australia 2nd ODI: నేడే భారత్ – ఆసీస్ రెండో వన్డే
India vs Australia 2nd ODI: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో వన్డేలో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా అమీతుమీ తెల్చుకోవడానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ లో గెలిచి ఆస్ట్రేలియా పరువు నిలుపుకోవాలని చూస్తుంది. తొలి వన్డేకు భారత్‌కు దూరమైన రోహిత్ శర్మ.. రెండో వన్డేకి జట్టులోకి చేరనున్నాడు.
రెండో వన్డే విశాఖపట్నంలోని వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. చాలా రోజుల తర్వాత విశాఖపట్నంలో అంతర్జాతీయ వన్డే జరుగుతోంది. ఒకటిన్నర గంటలకు ఆట మొదలవుతుంది. అయితే ఆంధ్ర,తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్న సమయంలో ఈ మ్యాచ్ పై వర్ష ప్రభావం పడనుంది.
జట్టు నమూనా
భారత్ : శుభ్‌మన్ గిల్, రోహిత్‌శర్మ (కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్‌యాదవ్, కేఎల్‌రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జడేజా, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, షమీ, కుల్దీప్ యాదవ్
ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్-కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా