India Vs Australia: భారత్ భారీ స్కోర్, తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులు
India Scored 571 runs in the First Innings
నాల్గవ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. గిల్, కోహ్లీ, అక్షర్ పేటేల్ అద్భుతంగా రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, చటేశ్వర పుజారా, శ్రీకర్ భరత్ తదితరులు పర్వాలేదనిపించారు. వీరందరూ ఆసీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొని భారీ స్కోర్ చేశారు. విరాట్ కోహ్లీ 186 పరుగులు చేశాడు. భారత ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా బ్యాటింగ్ చేయడానికి దిగలేదు. దీంతో కోహ్లీ ఔటవ్వగా భారత్ ఆలౌట్ అయినట్లు ప్రకటించారు. మొత్తంగా భారత జట్టు 571 పరుగులు చేసింది. ఆసీస్ జట్టుపై 91 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నాల్గవ టెస్టు ముగియడానికి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. చివరి రోజున ఆసీస్ తక్కువ పరుగులకు ఆలౌట్ చేసి..ఆ లక్ష్యాన్ని భారత్ చేరుకోగలిగితే భారత జట్టుకు విజయావకాశాలుంటాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువుగా కనిపిస్తున్నాయి.
విరాట్ కోహ్లీ వీర విహారం
తొలి ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ వీరవిహారం చేశాడు. 186 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తయిన తర్వాత కాస్త జోరు పెంచాడు. సెంచరీ చేసే సందర్భంగా కేవలం 5 ఫోర్లు మాత్రమే కొట్టిన కోహ్లీ, ఆ తర్వాత గేరు మార్చాడు. మరో 10 ఫోర్లు కొట్టాడు. మొత్తంగా 15 ఫోర్లు కొట్టి 186 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు.
అక్షర్ పటేల్ 79 పరుగులు
ఇటీవల కాలంలో అక్షర్ పటేల్ అదరగొడుతున్నాడు. అహ్మదాబాద్ స్టేడియంలో మరోసారి తన సత్తా చాటాడు. 79 పరుగులు చేశాడు. మందకోడిగా సాగుతున్న ఆటలో జోష్ నింపాడు. 5 ఫోర్లు 4 సిక్సులు బాదాడు. స్కోర్ బోర్డును కాసేపు పరుగులు పెట్టించాడు. జట్టు స్కోర్ పెంచాడు. సెంచరీకి చేరువ అవుతున్నాడని అభిమానులు సంబరపడేలోగా ఔట్ అయ్యాడు.
Stumps on Day 4⃣ of the Fourth #INDvAUS Test!#TeamIndia 🇮🇳 88 runs ahead in the Final Test and Australia will resume batting tomorrow at 3/0.
We will back tomorrow with Day 5 action!
Scorecard – https://t.co/8DPghkx0DE @mastercardindia pic.twitter.com/Rf72OD81YR
— BCCI (@BCCI) March 12, 2023