India Vs SL: సెంచరీలతో కదం తొక్కిన గిల్, కోహ్లీ.. శ్రీలంక ముందు భారీ టార్గెట్
India Scored 390 runs in 3rd ODI against Sri Lanka
శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. శ్రీలంక ముందు 391 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీలు సెంచరీలతో కదం తొక్కారు. వీర విహారం చేశారు. లంక బౌలర్లను ఊచకోత కోశారు. బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించారు. విరాట్ కోహ్లీ 110 బంతుల్లో 166 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శుభ్ మన్ గిల్ 97 బంతుల్లో 116 పరుగులు చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. మొదటి 5 ఓవర్లు నెమ్మదిగా ఆడారు. ఆ తర్వాత గేరు మార్చారు. పరుగుల వరద పారించారు. 6వ ఓవర్లో ఏకంగా 23 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత కొంత వేగం తగ్గినా తర్వాత మళ్లీ హిట్టింగ్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో 42 పరుగుల వద్ద ఉన్న రోహిత్ శర్మ జౌటయ్యాడు. అప్పుటికి భారత జట్టు స్కోర్ 95 పరుగులు.
రోహిత్ శర్మ ఔటైన తర్వాత బరిలో దిగిన కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. స్టేడియం నలువైపులా షాట్లు కొట్టాడు. అభిమానులను అలరించాడు. తనలోని వేడి తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా చెలరేగి ఆడాడు. చివరి వరకు నిలిచాడు. 166 పరుగులు చేశాడు. జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సహకరించాడు.
శ్రేయాస్ అయ్యార్ 38 పరుగులు చేసి ఔటవ్వగా, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. మొత్తం మీద 50 ఓవర్లు పూర్తయ్యే సరికి భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 390 పరుగులు చేసింది. కసన్ రజితకు 2 వికెట్లు, లాహిరు కుమారకు 2 వికెట్లు దక్కాయి. చమిక కరుణరత్నకు ఒక వికెట్ దక్కింది.
Virat Kohli was utterly glorious 🙌 🙌 as he creamed 1⃣6⃣6⃣* and was our top performer from the first innings of the third #INDvSL ODI 👏 👏
A summary of his stunning batting display 🔽 #TeamIndia pic.twitter.com/SWrC5Oanhg
— BCCI (@BCCI) January 15, 2023
Innings Break!
A stupendous knock of 166* from @imVkohli & a fine 116 by @ShubmanGill guides #TeamIndia to a formidable total of 390/5.
Scorecard – https://t.co/muZgJH3f0i #INDvSL @mastercardindia pic.twitter.com/aGHQU7PQVw
— BCCI (@BCCI) January 15, 2023