India VS Australia: గిల్, కోహ్లీ బ్యాటింగ్ టాలెంట్.. టీమిండియా 289
India Scored 289 runs at the end of 3rd Day in the Fourth test
భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న నాల్గవ టెస్టు ఆసక్తికరంగా మారింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు ఆడుతున్నాయి. తొలి ఇనింగ్స్ లో ఆసీస్ జట్టు 480 పరుగులు చేయగా..టీమిండియా కూడా తడబడకుండా ఆడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఇద్దరూ బరిలో ఉన్నారు.
128 పరుగులు చేసిన గిల్
ఓపెనర్ శుభ్మన్ గిల్ అహ్మదాబాద్ నగరంలో అదరగొట్టాడు. శతకంతో అలరించాడు. ఎంతో ఓపికతో ఆడి టెస్టుల్లో రెండో సెంచరీ నమోదు చేశారు. ఈ ఏడాది మొదటి నుంచి మంచి ఫాంలో ఉన్న గిల్ సెంచరీలతో అలరిస్తున్నాడు. వన్డేల్లోను, టీ 20లోను, టెస్టుల్లోను ఒకే ఏడాది సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.
1️⃣2️⃣8️⃣ Runs
2️⃣3️⃣5️⃣ Balls
1️⃣2️⃣ Fours
1️⃣ Six@ShubmanGill scored a magnificent century and put #TeamIndia 🇮🇳 on 🔝 on Day 3 👏👏Relive his special ton here 📽️👇 #INDvAUS https://t.co/dGhst8kkcX pic.twitter.com/yzx6rXQgfV
— BCCI (@BCCI) March 11, 2023
చాలా కాలం తర్వాత కోహ్లీ హాఫ్ సెంచరీ
విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత హాఫ్ సెంచరీ చేశాడు. పుజారా ఔట్ అయిన తర్వాత బరిలో దిగిన కోహ్లీ ఎంతో ఓపికతో ఆడాడు. మొదట్లో కాస్త తడబడినట్లు కనిపించిన కోహ్లీ ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నాడు. పరుగులు పిండుకున్నాడు. శుభ్మన్ గిల్ కు చక్కని సహకారం అందిస్తూనే తాను కూడా పరుగులు చేశాడు. టెస్టుల్లో 29వ హాఫ్ సెంచరీ చేశాడు. 2022 జనవరిలో చివరి సారిగా హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయాడు. ప్రస్తుతం అహ్మదాబాద్ నగరంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ కోహ్లీకి కలిసి వచ్చింది.
Stumps on Day 3⃣ of the Fourth #INDvAUS Test!
Brilliant batting display by #TeamIndia 🇮🇳 as we move to 289/3 at the end of day's play.
We will be back with Day 4 action tomorrow, with India trailing by 191 runs.
Scorecard ▶️ https://t.co/8DPghkx0DE@mastercardindia pic.twitter.com/itAO7Wb1un
— BCCI (@BCCI) March 11, 2023
రోహిత్ శర్మ అరుదైన రికార్డు
భారత కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి 17 వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన 6వ భారత ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. అంతకు ముందు భారత జట్టు తరపున ఈ ఘనత సాధించిన వారిలో సచిన్, ద్రావిడ్, గంగూలీ, ధోనీ, కోహ్లీ మాత్రమే ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో రోహిత్ శర్మ చేరాడు.
𝗔 𝗱𝗮𝘆 𝗳𝘂𝗹𝗹 𝗼𝗳 𝗺𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲𝘀!
Congratulations to #TeamIndia 🇮🇳 captain @ImRo45 on reaching 1⃣7⃣0⃣0⃣0⃣ runs in international cricket 👏👏 pic.twitter.com/CZ8vYpHmGe
— BCCI (@BCCI) March 11, 2023