Hockey World Cup: హాకీ వరల్డ్ కప్ నుంచి ఇంటిబాట పట్టిన భారత్ టీమ్
Hockey World Cup: 2023 పురుషుల ప్రపంచకప్ నుంచి భారత్ ఓటమితో నిష్క్రమించింది. ఆదివారం జరిగిన క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లో భారతజట్టు పెనాల్టీ షూటౌట్‌లో 4-5తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో నాకౌట్‌కు చేరకుండానే వైదొలిగింది.పురుషుల హాకీ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టు అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఇండియాకంటే తక్కువ ర్యాంకు కలిగిన జట్టు చేతిలో భారత్ సేన ఓటమి పాలైఇంటి ముఖం పట్టింది.
భారత్ తరఫున లలిత్ ఉపాధ్యాయ్ సుఖ్‌జీత్‌సింగ్ వరుణ్ కుమార్ గోల్స్ చేశారు. ఆతరువాత న్యూజిలాండ్ కూడా మూడు గోల్స్ చేయడంతో ఫలితం పెనాల్టీ షూటౌట్‌కు డై తీసింది. మ్యాచ్‌లో ముందుగా ఇండియా-న్యూజిలాండ్ జట్లుసమానంగా నిలిచాయి. అయితే, పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేయడంలో హర్మన్ ప్రీత్ సింగ్ విఫలం కావడం భారత జట్టు విజయావకాశాల్ని దెబ్బతీసింది. న్యూజిలాండ్ నిర్ణిత సమయంలో 5 గోల్స్ చేయగా, ఇండియా 4 గోల్స్ మాత్రమే చేయగలిగింది.