India VS New Zealand Match: రెండో వన్డేలోను భారత్ సత్తా చాటేనా?
India, New Zealand Second one day Match in Raipur
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ రేపు రాయ్ పుర్ లో జరగనుంది. షహీద్ వీర్ నారాయన్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. షహీద్ వీర్ నారాయన్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే తొలి వన్డే ఇదే కావడం విశేషం. గతంలో ఈ స్టేడియంలో 6 ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. కొన్ని స్థానిక మ్యాచులు కూడా జరిగాయి. మొట్ట మొదటి సారిగా ఓ వన్డే మ్యాచ్ జరగడం మాత్రం ఇదే తొలిసారి కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాచ్ కి చెందిన టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.
బ్యాటింగ్ విభాగంలో చాలా పటిష్టంగా ఉన్న రోహిత్ సేన, బౌలింగ్ విభాగంపై మరింత ఫోకస్ చేయనుంది. వన్డే వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు ద్రవిడ్ నేతృత్వంలోని టీమ్ తీవ్రంగా కృషి చేస్తోంది. దానికి అనుగుణంగా మార్పులు చేస్తోంది.
మూడు మ్యాచుల వన్డే సిరీస్ లో భారత జట్టు ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచి మంచి ఊపులో ఉంది. ఉప్పల్ లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో కివీస్ జట్టు కూడా భారత జట్టుకు తగిన స్థాయిలోనే పోరాటం కనబరిచింది. రెండో మ్యాచ్ లో కూడా అదే తరహా పోరాటం కనబరిచే అవకాశం కనిపిస్తోంది.
భారత జట్టులో బ్యాటర్లు సమర్ధవంతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. తమ సత్తా చాటుకుంటున్నారు. భారీ స్కోర్లు చేయడంలో సహకరిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ దగ్గర నుంచి అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. పరుగులు వరద పారిస్తున్నారు. విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు బ్యాటింగ్ విభాగంల తమ వంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.