సెమీస్ పోరులో టీమిండియా చేతులెత్తేసింది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంటిబాట పట్టింది. అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.
India defeated by England in the Semi Final Match
సెమీస్ పోరులో టీమిండియా చేతులెత్తేసింది. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఓటమి పాలయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంటిబాట పట్టింది. అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ భారత బౌలర్లను కుమ్మేశారు. ఏ ఒక్కరినీ వదలకుండా వీర బాదుడు బాదారు. మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయ్యారు. జోస్ బట్లర్ 80 పరుగులు చేయగా, అలెక్స్ హేల్స్ 86 పరుగులు చేశాడు.
తొలిత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు మొదటి నుంచి హిట్టింగ్ ప్రారంభించింది. 4 ఓవర్లలో 41 పరుగులు చేసింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. మొదటి నుంచి చివరి వరకు అదే ఊపు కొనసాగించారు. బౌండరీల వర్షం కురిపించారు. మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యం చేరుకున్నారు. తద్వారా ఫైనల్స్ లో ప్రవేశించారు. పాక్ జట్టుతో ఆదివారం జరిగే తుదిపోరులో తలపడనున్నారు.
A brilliant performance to reach the finals! 👌
England were #InItToWinIt from the word go! 🤩@royalstaglil | #T20WorldCup pic.twitter.com/YEHnTyEWKL
— ICC (@ICC) November 10, 2022
47 బంతుల్లో 4 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసిన అలెక్స్ హేల్స్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Alex Hales put on a show in Adelaide 🎆
For his fiery 47-ball 86*, he is the @aramco POTM 🌟 pic.twitter.com/eWCpUVeRS8
— ICC (@ICC) November 10, 2022