IND vs NZ: సిరీస్ పై కన్నేసిన భారత్
IND vs NZ 2nd ODI: శ్రీలంకతో జరిగిన ఉత్కంఠ పోరులో సిరీస్ దక్కించుకున్న టీమిండియా ఇప్పుడు మరో సిరీస్ పై కన్నేసింది. భారత్ -న్యూజిలాండ్ తో జరుగుతున్నా వన్డేలలో మొన్న జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. తొలి పోరులో నెగ్గి 1-0తో ముందంజలో ఉన్న భారత్ సేన.. ఇదే జోష్ లో సిరీస్ పట్టేయాలని ఉత్సహంతో ఉంది. ఇందుకు సమరానికి రాయపూర్ నేడు వేదిక కానుంది.
గత పోరులో డబుల్ సెంచరీ చేసిన శుభ్‌మన్ తో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్,మహమ్మద్ సిరాజ్ వంటి వాళ్లకు ఇది మరో మంచి అవకాశం కానుంది. మొదటి మ్యాచ్ లో చెలరేగి ఆడిన శుభ్‌మన్, సిరాజ్ ల వల్లే పరువు దక్కింది డబుల్ సెంచరీతో శుభ్‌మన్..బౌలింగ్ లో సిరాజ్ లు లేకపోతే హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ కచ్చితంగా ఓడిపోయి ఉండేది. ఇక సీనియర్లు కూడా ఈ మ్యాచ్ లో రాణించాలని భావిస్తున్నారు.
ఎంత జాగ్రతగా ఆడిన కానీ బ్రేస్‌వెల్, శాంట్నర్ లు భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూన్నారు ఈరోజు వారిపై ద్రుష్టి పెట్టనున్నారు.మొదటి మ్యాచ్ లో 250 పరుగులు కూడా అసాధ్యం అనుకున్న టీమిండియాకు బ్రేస్‌వెల్, శాంట్నర్ లుకలిసి టీమిండియాకు చుక్కలు చూపించారు. ఇక ఈరోజు మ్యాచ్ లో రోహిత్, శుభ్‌మన్ గిల్ మంచి ఓపెనింగ్ జోడీ కుదురుకోగా.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా రూపంలో మిడిలార్డర్ కూడా బలంగానే కనిపిస్తున్నా.. యువ ఆటగాళ్లలో భారీ స్కోర్ దిశగా ఆలోచిస్తూ నిలకడ లేమి సమస్యగా కనిపిస్తున్నది. ఇక మొదటి మ్యాచ్ లో పరువు పోగొట్టునకున్న కివీస్. నేటి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. బ్రేస్‌వెల్, శాంట్నర్‌ల మీద అందరు మరోసారి ఆశలుపెట్టుకున్నారు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్, సూర్యకుమార్, హార్దిక్, సుందర్, శార్దూల్/ఉమ్రాన్, కుల్దీప్, షమి, సిరాజ్.
న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్) ఆలెన్, కాన్వే, నికోల్స్, మిచెల్, , ఫిలిప్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్, షిప్లే, ఫెర్గూసన్, టిక్నెర్.