IND vs NZ, 1st ODI: న్యూజిలాండ్ పై భారత్ గెలుపు..సొంత గడ్డపై చెలరేగిన మహ్మద్ సిరాజ్
IND vs NZ, 1st ODI: ఉప్పల్ స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ పోరులో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు భారీ స్కోరు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్ శుభమాన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. డబుల్ సెంచరి చేసి ప్రత్యర్థి టీమ్కు చుక్కలు చూపించాడు. దీంతో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.
కివీస్ ముందు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఉంచింది. స్కోరు బోర్డుపై ఈ పరుగులు చూసి అభిమానులు భారత్ దే విజయం అని నిర్ణయించుకున్నారు. కానీ కివీస్ మాత్రం ఈ స్కోరును అవలీలగా దాటేయచ్చుఅనుకుని బరిలోకి దిగింది. భారత బౌలర్ల వేగానికి 110 పరుగులకే సగం జట్టు పెవిలియన్ చేరింది. దీంతో భారత్ విజయం అనుకున్నారంతా కానీ అక్కడే ఆట మలుపుతిరిగింది. మైఖెల్ బ్రాస్ వెల్ గ్రౌండ్ లోకి వచ్చాక భారత బౌలర్ల కు చుక్కలు చూపించాడు. డాపెడా ఫోర్లు, సిక్సులు బాదుతూ కేవలం 78 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు.
దీంతో గ్రౌండ్లో ఉన్న ప్లేయర్స్ కి ఆటచూస్తున్న ప్రేక్షకులకు చలికాలంలో చమటలు పట్టాయి. బ్రాస్ వెల్ సిక్స్ లు కొడుతుంటే ఒక్కొక్కరికి ముచ్చెమటలు పట్టాయి. మైఖేల్ బ్రేస్‌వెల్ కు మిచెల్ సాంట్నర్ తోడవడంతో వీరిద్దరి మధ్య 162 పరుగుల భాగస్వామ్యం చేసారు. ఇక వీరి పట్నార్ షిప్ బ్రేక్ చేస్తే తప్ప వేరేమార్గం కనిపించలేదు అందుకు సిరాజ్ ముందుకొచ్చాడు. వీరిని విడగొట్టడానికి విశ్వప్రయంతలు చేసి చివరికి బ్రేస్‌వెల్ ను అవుట్ చేసాడు వెనువెంటనే మరో వికెట్ ను తీసి భారత్ కి విజయాన్నందించాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 49.1 వికెట్లకు 337 పరుగులు మాత్రమే చేయగలిగింది. సొంతగడ్డ రుణం తీర్చుకున్నాడంటూ మహ్మద్ సిరాజ్ ను పలువురు ప్రశంసిస్తున్నారు.