Ind vs Aus 3rd Test: నేటి నుంచే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు
Ind vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్‌లు అడ్డాగా రెండింటిల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. మూడో టెస్టు మ్యాచ్ నేడు ఇండోర్‌లో ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ ను ఇండియా కైవసం చేసుకుంటే సిరీస్ ఇండియా సొంతం అయినట్లే.
తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిన ఈ జట్టు మూడో టెస్టులో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్ వంటి కీలక ఆటగాళ్లు కూడా జట్టుతో చేరడం ఆసీస్‌కు కలిసొచ్చేలా ఉంది. ఈ క్రమంలో మూడో టెస్టులో అత్యధిక పరుగులు చేసే బ్యాటర్ ఎవరనే విషయంపై అభిమానుల మధ్య తెగ చర్చ నడుస్తోంది. ఎలాగైనా మూడో మ్యాచులో ఇండియా కి ఆస్ట్రేలియా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. ఈ టెస్టు సిరీస్‌లో అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్న ప్లేయర్ రోహిత్ శర్మ. కఠినమైన నాగ్‌పూర్ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ బాదిన రోహిత్.. ఢిల్లీలో కూడాబాగానే రాణించాడు. ముఖ్యంగా ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీ20 తరహాలో విరుచుకుపడ్డాడురోహిత్ శర్మ. ఇండోర్లో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. అతని ఇండోర్ పిచ్పై 228 పరుగులు చేశాడు. మరి నేటి మ్యాచ్ లో కోహ్లీ ఎలా విజృంభిస్తాడో అని అణ్డరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 10 మ్యాచ్‌లలో విజయం సాధించిన విషయం విధితమే. రెండు మ్యాచ్‌లు డ్రా కాగా, నాలుగు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. బౌలర్లలో అశ్విన్, షమీకి ఈ పిచ్పై మంచి రికార్డు ఉంది. రెండు టెస్టులలో ఓడిన ఆస్ట్రేలియా ఈ టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది.