Hardik Pandya: ఆస్ట్రేలియా తొలి వన్డేకు హార్దిక్ పాండ్యా సారథ్యం
Hardik Pandya: ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా మూడు వన్డేల సిరీస్‌కు సిద్దమైంది. ఈనెల 17 న శుక్రవారం ముంబై వేదికగా జరిగే తొలి వన్డేలో ఆసీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అవ్వగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. నేపథ్యంలో సునీల్ గవాస్కర్ మాటాడుతూ..పాండ్యా తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో హార్దిక్ కెప్టెన్సీచాలా బాగుంది. గుజరాత్ టైటాన్స్, భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. ఆస్ట్రేలియాతో ముంబైలో జరిగే తొలి వన్డేలో భారత్ విజయం సాధిస్తే.. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం భారత కెప్టెన్‌గా పాండ్య పేరు వినిపిస్తుందన్నారు.
ఈ వన్డే జట్టులో విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలతో కూడిన భారతజట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. ఇక శ్రేయస్ అయ్యర్ గాయపడడం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమనిపిస్తుంది. వాంఖడే స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్టు తలపడడం ఇది ఐదోసారి. అందులో మూడుసార్లు ఆసీస్, రెండుసార్లు భారత్ గెలిచాయి. ఈ వేదికపై 2020 జనవరిలో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 10వికెట్ల తేడాతో భారతజట్టుపై ఘన విజయం సాధించింది.