Inappropriate Comments: కోహ్లీ, ధోనీ కుమార్తెలపై అనుచిత వ్యాఖ్యలు..ఎఫ్‌ఐఆర్‌నమోదు
Inappropriate Comments: క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీల కుమార్తెలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆరు సోషల్ మీడియా ఖాతాలపై ఢిల్లీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతీ మలివాల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఐటీ చట్టంలోని సెక్షన్ 67B(D) కింద కేసు పెట్టారు. ఏడేళ్లు, రెండేళ్లు వయసు ఉన్న ఆ పిల్లలు, వారి తల్లులను దుర్భాషలాడారంటూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్వాతీ మలివాల్‌మండిపడ్డారు. చిన్న పిల్లల గురించి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తారా? ఒక ఆటగాడిని ఇష్టపడకపోతే అతని కుమార్తెను దుర్భాషలాడతారా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కుఅంటూ ఫైర్ అయ్యారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని పోలీసులకు నోటీసు జారీ చేశాను అంటూ స్వాతి మలివల్ ట్వీట్ చేశారు. ఈ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అతి త్వరలో దోషులందరినీ అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపుతారంటూ ట్వీట్ చేశారు.
देश के 2 बड़े खिलाड़ी विराट कोहली और धोनी की बच्चियों की तस्वीरें ट्विटर पर डालकर कुछ एकाउंट्स भद्दी टिप्पणी कर रहे हैं। 2 साल & 7 साल की बच्ची के बारे में ऐसी घटिया बातें? कोई खिलाड़ी नहीं पसंद तो क्या उसकी बच्ची को गाली दोगे? पुलिस को FIR दर्ज करने के लिए नोटिस जारी कर रहे हैं। pic.twitter.com/9ybadS659r
— Swati Maliwal (@SwatiJaiHind) January 11, 2023