ICC: టీ 20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022..సూర్యకుమార్ యాదవ్
ICC T 20 Player of the year, Surya Kumar Yadav
టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐసీపీ ప్రకటించిన టీ 20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నాడు. గత ఏడాది చెలరేగి ఆడిన సూర్య కుమార్ కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరించడమే కాకుండా ఐసీపీ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. 890 రేటింగ్ పాయింట్స్ సాధించడం ద్వారా సూర్య కుమార్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు.
సూర్య గత ఏడాది ఆడిన 31 టీ 20 మ్యాచుల్లో ఏకంగా 1164 పరుగులు సాధించాడు. రెండు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు బాదాడు. గత ఏడాదిలో ఏకంగా 68 సిక్సర్లు కొట్టాడు. టీ 20 ఫార్మాట్ ఏ ఇతర ఆటగాడు ఇటువంటి ఫీట్ సాధించలేకపోయాడు. కేవలం అది సూర్యకు మాత్రమే సాధ్యపడింది. అందుకే టీ 20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు దక్కింది.
ఒక కేలండర్ ఇయర్ లో 1000 పరుగులు చేసిన రెండవ ఆటగాడికి సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. గత ఏడాది జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో కూడా సూర్య చెలరేగి ఆడాడు. మూడు అర్ధశతకాలు సాధించాడు.
గత ఏడాది సూర్య కుమార్ ఆడిన ఎన్నో మ్యాచులు అభిమానులను అలరించాయి. నాటింగ్ హంలో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ సూర్య వీర విహారం చేశాడు. కేవలం 55 బంతుల్లోనే 117 పరుగులు చేశాడు. చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు.
𝗣𝗿𝗲𝘀𝗲𝗻𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗜𝗖𝗖 𝗠𝗲𝗻'𝘀 𝗧𝟮𝟬𝗜 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗬𝗲𝗮𝗿 2️⃣0️⃣2️⃣2️⃣
Congratulations @surya_14kumar 👏🏻👏🏻#TeamIndia pic.twitter.com/YdgWWxvkAW
— BCCI (@BCCI) January 25, 2023
Presenting the ICC Men's T20I Cricketer of the Year 2022 👀#ICCAwards
— ICC (@ICC) January 25, 2023
..