ICC ODI team: ఐసీసీ వన్డే జట్టులో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు, ఎవరో తెలుసా?
ICC ODI team of 2022 has two Indian Players
గత ఏడాది వన్డే మ్యాచుల్లో అదరగొట్టిన 11 మంది ప్లేయర్ల జాబితాను ఐసీసీ విడుదల చేసింది. వారి ఆటతీరు ఆధారంగా జట్టుగా ఏర్పరచి స్థానాలు కల్పించింది. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ కెప్టెన్ అర్హతలు కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
ఐసీసీ ప్రకటించిన జట్టులో పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ కెప్టెన్ స్థానం దక్కించుకున్నాడు. ఇక జట్టులో ఇతర ప్లేయర్ల విషయానికి వస్తే ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవిస్ హెడ్, వెస్టిండీస్ కు చెందిన షాయి హోప్, న్యూజిలాండ్ కు చెందిన టామ్ లాథమ్, జింబాబ్వేకు చెందిన సికిందర్ రజా, బంగ్లాదేశ్ కి చెందిన మెహదీ హసన్ మిరాజ్, వెస్టిండీస్ కు చెందిన అల్జరీ జోసెఫ్, న్యూజిలాండ్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ ఉన్నారు. టీమిండియాకు చెందిన శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్ ఇద్దరూ ఐసీసీ 2022 వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నారు.
శ్రేయాస్ అయ్యర్ గత ఏడాది వన్డేలలో ఇరగదీశాడు. భారత జట్టులో నాల్గవ స్థానంలో మొత్తం 17 మ్యాచులు ఆడిన 724 పరుగులు చేశాడు. 55.69 సగటుతో పరుగులు సాధించాడు. ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు చేయడం ద్వారా తన సత్తా చాటుకున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో తిరుగులేని ఆటగాడిగా ఎదిగాడు. ఐసీసీ జట్టులో స్థానం సంపాదించాడు.
భారత వన్డే జట్టులో మహ్మద్ సిరాజ్ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. గత ఏడాదిలో తనకు లభించిన అవకాశాలను చక్కగా సద్వినియోగపరుచుకున్నాడు. మొత్తం 15 మ్యాచుల్లో మొత్తం 24 వికెట్లు తీశాడు. 4.62 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. ఒక మ్యాచులో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో సిరాజ్ కు కలిసి వచ్చింది. భారత విజయాలలో కీలక పాత్ర పోషించాడు.
ICC ODI Men's Team of the year 2022. Babar Azam is the captain of the Team Ma Sha Allah, our King♥️😭. #BabarAzam𓃵 #ICCAwards pic.twitter.com/fW1ItoROle
— Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) January 24, 2023