Hockey World Cup: ఒరిస్సాలో జరగనున్న హాకీ వరల్డ్ కప్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Hockey World Cup in Odisha from January 13
హాకీ వరల్డ్ కప్ పోటీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అభిమానులను అలరించనున్నాయి. ఈ నెల 13వ తేదీన మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఒడిషాలో రెండు స్టేడియంలు సిద్ధంగా ఉన్నాయి. 2018లో కూడా హాకీ వరల్డ్ కప్ పోటీలు ఒడిషాలోనే జరిగాయి. ఐదేళ్ల తర్వాత మరోసారి ఇక్కడే పోటీలు జరగనున్నాయి. గత వరల్డ్ కప్‌లో కేవలం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలోనే పోటీలు జరిగాయి.
ఈ సారి కొత్తగా బిర్సాముండా స్టేడియం కూడా జతకలిసింది. పోటీలు నిర్వహించేందుకు సిద్ధమయింది. బిర్సా ముండా స్టేడియంలో 20,000 మంది కెపాసిటీ కలిగి ఉంది. జనవరి 13న ప్రారంభం కానున్న పోటీలు జనవరి 29 వరకు జరగనున్నాయి. బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా జట్లు పూల్ B లో ఉన్నాయి. మిగతా జట్లు పూల్ Aలో ఉన్నాయి.
వరల్డ్ కప్ హాకీ పోటీల్లో 16 దేశాలు
ఈ సారి జరిగే వరల్డ్ కప్ హాకీ పోటీల్లో 16 దేశాలు పాల్గోనున్నాయి. కొన్ని దేశాలకు చెందిన ప్లేయర్లు అప్పుడే ఒడిషా చేరుకున్నారు. ఇక్కడి వాతావరణానికి అలవాడు పడుతున్నారు. ప్రాక్టీస్ మొదలు పెట్టారు. బెల్జియం, మలేషియా, సౌతాఫ్రికా, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లకు చెందిన ప్లేయర్లు భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో జనవరి 7న దిగారు.
The Spanish Hockey team was warmly welcomed in Rourkela and expressed excitement about competing in the FIH Odisha Hockey Men's World Cup 2023, Bhubaneswar-Rourkela. pic.twitter.com/F9iqE43Mtu
— Hockey India (@TheHockeyIndia) January 8, 2023
1971లో వరల్డ్ కప్ పోటీలు ప్రారంభం
హాకీ వరల్డ్ కప్ పోటీలు 1971 నుంచి ప్రారంభం అయ్యాయి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతీ ఐదేళ్ల కోసారి హాకీ అభిమానులను అలరిస్తున్నాయి. వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం నుంచి భారత్, పాక్ జట్లు సత్తా చాటుతూ వస్తున్నాయి. ఈ సారి మాత్రం పాకిస్తాన్ జట్టు ఏకంగా టోర్నీలో ఆడేందుకు కనీసం క్వాలిఫై కూడా కాలేదు. గతంలో 2014లో ఓ సారి ఇలాగే జరిగింది. తాజాగా 2023లో జరుగుతున్న ఈ టోర్నీలో కూడా పాక్ జట్టు లేకుండానే పోటీలు జరగనున్నాయి.
సీఎం బంపర్ ఆఫర్
ఈ ఏడాది హాకీ వరల్డ్ కప్ గెలిచినట్లయితే జట్టులోని ప్రతి ఆటగాడికి ఒక్కో కోటి రూపాయలు ఇస్తానని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
భారత్‌లో జరగడం ఇది నాల్గవ సారి
హాకీ వరల్డ్ కప్ పోటీలు భారత్‌లో జరగడం ఇది నాల్గవ సారి. 1982లో ముంబైలో, 2010లో ఢిల్లీలో జరిగాయి. 2018లో ఒడిషాలో జరిగాయి. ఈ సారి కూడా ఒడిషాయే వరల్డ్ కప్ హాకీ పోటీలను నిర్వహిస్తోంది. హాకీ వరల్డ్ కప్ పోటీలను వరుసగా రెండుసార్లు నిర్వహించడం ఇదే తొలిసారి. అదే విధంగా రెండు స్టేడియాలలో వరల్డ్ కప్ పోటీలు జరగడం కూడా ఇది తొలిసారి కావడం విశేషం.
2018 విజేత బెల్జియం
2021లో టోక్యో ఒలింపిక్స్ లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది. ప్రస్తుతం భారత జట్టు మంచి ఉత్సాహంతో ఉంది. అదే ఊపును వరల్డ్ కప్‌లో కొనసాగించనుంది. 2018లో బెల్జియం జట్టు విజేతగా నిలిచింది. ఆ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఈ సారి బరిలో దిగనుంది.
1971 నుంచి హాకీ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్నా…భారత్ మాత్రం ఒకే ఒక్కసారి విజేతగా నిలిచింది. మలేషియాలోని కౌలాలంపుర్‌లో 1975లో జరిగిన పోటీల్లో పాక్ జట్టును 2-1 తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.
ఏడోసారి
ఆసియా దేశాలలో వరల్డ్ కప్ జరగడం ఇది ఏడవ సారి. గతంలో ఆసియా దేశాల్లో జరిగిన వరల్డ్ కప్ పోటీల్లో ఎన్నడూ కూడా ఆసియా జట్లయిన భారత్, పాక్, మలేషియాలు కప్ గెలవలేకపోయాయి.
అరంగేట్ల జట్లు ఇవే
చిలీ దేశం ఈ ఏడాది పోటీల్లో తొలిసారిగా ఆడనుంది. చిలితో పాటు వేల్స్ జట్టు కూడా అరంగేట్రం చేయనుంది.
The Spanish Hockey team has arrived at the World Cup Village in the Birsa Munda Hockey Stadium in Rourkela to compete in FIH Odisha Hockey Men's World Cup 2023 Bhubaneswar-Rourkela.#HockeyIndia #IndiaKaGame #HWC2023 #StarsBecomeLegends @CMO_Odisha @Media_SAI @IndiaSports pic.twitter.com/tTdqF9ZJhs
— Hockey India (@TheHockeyIndia) January 8, 2023
Getting into the swing of the FIH Odisha Hockey Men's World Cup 2023 Bhubaneswar-Rourkela.
Here are some of the snippets from the practice match between India and New Zealand. pic.twitter.com/u1jG4AB8cm
— Hockey India (@TheHockeyIndia) January 9, 2023
The Japanese team has arrived in Bhubaneswar excited to compete in FIH Odisha Hockey Men's World Cup 2023 Bhubaneswar-Rourkela.#HockeyIndia #IndiaKaGame #HWC2023 #StarsBecomeLegends @CMO_Odisha @sports_odisha @Media_SAI @IndiaSports @FIH_Hockey pic.twitter.com/JWYstWZI7q
— Hockey India (@TheHockeyIndia) January 9, 2023