IPL 2022: భారీ రికార్డ్‌పై కన్నేసిన హిట్‌మ్యాన్
ఇవాళ ముంబై ఇండియన్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌లో ఓడిన ముంబై టీమ్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. దీంతో ముంబై టీంకు ఇక నుంచి ప్రతీ మ్యాచ్ కీలకమనే చెప్పాలి. ముంబై, పంజాబ్ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ముందు భారీ రికార్డ్ ఉంది.
ఇప్పటి వరకు 372 టీ20 మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్ 9 వేల 975 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 25 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత రెండో బ్యాట్స్‌మెన్‌గా, ప్రపంచ క్రికెట్‌లో ఏడవ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించనున్నాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఇది వరకే రికార్డు నెలకొల్పాడు. మరోవైపు యూనివర్సల్ బాస్ క్రిస్‌గెల్ 463 మ్యాచ్‌ల్లో 14 వేలకు పైగా స్కోర్ చేసి టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తర్వాతి ప్లేస్‌లో వరసగా షోయబ్ మాలిక్, కీరన్ పోలార్డ్, అరోన్ ఫించ్, విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్‌లు ఉన్నారు.
టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల బలాబలాలు చూస్తే ముంబై టీంలో రోహిత్ శర్మ, సూర్యకుమార్, కీరన్ పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రా ఉండగా.. పంజాబ్‌లో టీంలో మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, కగిసో రబాడ లాంటి స్టార్‌లు ఉన్నారు.