Hardik Pandya: పాండ్యా ఖాతాలో అరుదైన రికార్డ్
Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అంటే పరిచయం అక్కరలేని పేరు. క్రికెట్ లోనే కాదు సోషల్‌మీడియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య ఇప్పుడు 25 మిలియన్లను దాటింది. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు పాండ్యా . రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, మాక్స్ వెర్‌స్టాపెన్, ఎర్లిగ్ హాలాండ్ వంటి గ్లోబల్ స్టార్‌ల కంటే.. పాండ్యానే ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉండడం విశేషం. ఈ సందర్భంగా తన ఫాలోవర్స్‌కు ధన్యవాదాలు తెలిపాడు.
క్రికెట్ లోనే కాకుండ . సోషల్ మీడియాలో కూడా దూకుడుగా ఉంటాడు పాండ్య. తన భార్య, పిల్లలు, ఫ్రెండ్స్ ఇతర కుటుంబ సభ్యులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాడు. విజయవంతమైన పాండ్యా పలు ప్రముఖ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్నాడు. 20కి పైగా బ్రాండ్స్ ప్రచారకర్తగా పెద్దమొత్తంలో ఆర్జిస్తున్నాడు. అలాకూడా అభిమానుల మన్ననలు అందుకుంటున్నాడు.