ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో సెంచరీలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టోర్నీ ప్రారంభమైన మార్చి 30 నుంచి ఇప్పటి వరకు టోర్నీలో 5 సెంచరీలు నమోదు కాగా తాజాగా మరో సెంచరీ నమోదయింది. గుజరాత్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ శతకంతో అలరించాడు.
Gujarat titans scored 188 runs against SRH
ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ టోర్నీలో సెంచరీలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టోర్నీ ప్రారంభమైన మార్చి 30 నుంచి ఇప్పటి వరకు టోర్నీలో 5 సెంచరీలు నమోదు కాగా తాజాగా మరో సెంచరీ నమోదయింది. గుజరాత్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ శతకంతో అలరించాడు.
సన్‌రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గిల్ చెలరేగి ఆడాడు. సాయి సుదర్శన్‌తో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. సాయి సుదర్శన్ ఔటన తర్వాతి నుంచి గుజరాత్ ఇన్నింగ్స్ పేక మేడను తలపించింది. ఓ ఒక్కరూ కనీసం డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయారు. గిల్ చివరి వరకు నిలిచి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టు మొదటి బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకుంది. గుజరాత్ జట్టును బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించింది. ఎప్పిటిలాగే భువనేశ్వర్ కుమార్ తన పట్టు నిలుపుకున్నాడు. మొదటి ఓవర్ 3వ బంతికే తొలి వికెట్ పడగొట్టాడు.ఆ సమయంలో సాయి సుదర్శన్ బరిలో దిగాడు. అక్కడి నుంచి ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోర్ 147 పరుగుల వద్ద ఉన్నప్పుడు వీరి జోడీకి మార్కో జాన్సన్ బ్రేక్ వేశాడు. సాయి సుదర్శన్ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఔటయ్యాడు. అక్కడి నుంచి చివరి ఓవర్ 5వ బంతి వరకు వికెట్ల పతనం కొనసాగింది. మోహిత్ శర్మ, షనక నాటౌట్‌గా నిలిచారు.
5 వికెట్లు తీసిన భువనేశ్వర్
సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. తొలి ఓవర్లో సాహా వికెట్ల తీసిన భువీ ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, మహ్మద్ షమీల వికెట్లు తీశాడు. భువీ చెలరేగి బౌలింగ్ చేయడంతో గుజరాత్ జట్టు 188 వద్ద ఆగింది. లేకపోతే మరింత భారీ స్కోర్ నమోదు అయి ఉండేది.
57 బంతుల్లో గిల్ శతకం
ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీలో ఇప్పటికే హ్యారీ బ్రూక్స్, వెంకటేశ్ అయ్యర్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సిమ్రాన్ సింగ్‌లు సెంచరీలు చేశారు. ఆ జాబితాలో శుభ్‌మన్ గిల్ చేరాడు. గిల్ 58 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 101 పరుగులు చేశాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో అబ్ధుల్ సమద్ క్యాచ్ పట్టడం ద్వారా ఔటయ్యాడు.
𝙈𝘼𝙄𝘿𝙀𝙉 𝙄𝙋𝙇 𝘾𝙀𝙉𝙏𝙐𝙍𝙔! 💯
A magnificent TON comes up for @ShubmanGill 👏🏻👏🏻 #TATAIPL | #GTvSRH | @gujarat_titans pic.twitter.com/YZHhiw8RkN
— IndianPremierLeague (@IPL) May 15, 2023
That HUNDRED feeling 🤗
Follow the match ▶️ https://t.co/GH3aM3hyup #TATAIPL | #GTvSRH | @ShubmanGill pic.twitter.com/C9UyUBvHd1
— IndianPremierLeague (@IPL) May 15, 2023
Innings Break!
A superb ton by @ShubmanGill powers @gujarat_titans to 188/9 in the first innings! 👏🏻@BhuviOfficial was the pick of the bowlers for @SunRisers with an impressive fifer 🙌
Scorecard ▶️ https://t.co/GH3aM3hyup #TATAIPL | #GTvSRH pic.twitter.com/jLHVzMz34Q
— IndianPremierLeague (@IPL) May 15, 2023