గుజరాత్ జట్టు వీరవిహారం సృష్టించింది. క్వాలిఫయర్ 2 మ్యాచ్లో ముంబై జట్టుపై ఏకండా 233 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ కేవలం 60 బంతుల్లోనే 10 సిక్సర్లు, 7 ఫోర్లలో 129 పరుగులు చేశాడు.
Gujarat scored 233 runs against Mumbai Indians
గుజరాత్ జట్టు వీరవిహారం సృష్టించింది. క్వాలిఫయర్ 2 మ్యాచ్లో ముంబై జట్టుపై ఏకంగా 233 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ కేవలం 60 బంతుల్లోనే 10 సిక్సర్లు, 7 ఫోర్లలో 129 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ 43 పరుగులు చేయగా, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్, క్రిస్ జోర్డాన్లు ఈ మ్యాచ్లో తేలిపోయారు. మధ్వాల్ 52 పరుగులు ఇవ్వగా, క్రిస్ జోర్డాన్ 56 పరుగులు సమర్పించుకున్నారు. మూడు ఓవర్లు వేసిన సీనియర్ బౌలర్ పీయూష్ శర్మ కూడా 45 పరుగులు సమర్పించుకున్నాడు. ఒక వికెట్ దక్కించుకున్నాడు.
చివరి 6 ఓవర్లో ఏకంగా 86 పరుగులు
14 ఓవర్లు పూర్తయ్యే సమయానికి గుజరాత్ జట్టు స్కోర్ 147 పరుగుల వద్ద ఉంది. చివరి 6 ఓవర్లో ఏకంగా 86 పరుగులు పిండుకుంది. 15వ ఓవర్లో 19 పరుగులు, 16వ ఓవర్లో 17 పరుగులు లభించగా, 17వ ఓవర్లో 15 పరుగులు లభించాయి. చివరిదైన 20 వ ఓవర్లో ఏకంగా 19 పరుగులు లభించాయి.
Hardik Pandya finishes the innings with a SIX!
Excellent batting display from Gujarat Titans 🔥🔥
Scorecard ▶️ https://t.co/f0Ge2x8XbA#TATAIPL | #Qualifier2 | #GTvMI pic.twitter.com/Se9yaBNAU4
— IndianPremierLeague (@IPL) May 26, 2023
Innings break!
Surreal batting performance from Gujarat Titans as they post 233/3 on board 🔥🔥
Shubman Gill the man of the moment with a magnificent 129(60) 🙌
Scorecard ▶️ https://t.co/f0Ge2x8XbA#TATAIPL | #Qualifier2 | #GTvMI pic.twitter.com/TPuCraDxNZ
— IndianPremierLeague (@IPL) May 26, 2023