GujaratGiants vs RCB: ఎట్టకేలకు బోణీ కొట్టిన గుజరాత్ జెయింట్స్
GujaratGiants vs RCB: విమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. ఎట్టకేకలకు గుజరాత్ జెయింట్ బోణీ కొట్టింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన గుజరాత్ జట్టు.. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 190పరుగులే చేయగల్గింది. దీంతో బెంగళూరు జట్టు ఈ టోర్నమెంట్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది.
హర్లీన్ డియోల్ 45 బంతుల్లో 67, సోఫియా డంక్లే 28 బంతుల్లో 65, అర్ధసెంచరీలతో చెలరేగి ఆడడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 201/7 స్కోరు చేయగలిగింది. శ్రేయాంక పాటిల్, హీథర్‌నైట్ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 190/6 స్కోరు చేసింది. సోఫీ డివైన్ 45 బంతుల్లో 66, అర్ధసెంచరీతో రాణించింది. ఓపెనర్ మేఘన 8 రన్నులకే అవుట్ కాగా మరో ఓపెనర్ సోఫియా డంక్లీ, హర్లీన్ డియెల్ బెంగళూరు జట్టుకు చెమటలు పట్టించారు.