Hardhik Pandya: వన్డేలకు హార్దిక్ పాండ్యా గుడ్‌బై ?
Goodbye to Hardik Pandya for ODIs: టీమిండియా స్టార్ క్రికెటర్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యానుద్దేశించి భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ అనంతరం హార్ధిక్ పాండ్యా వన్డే కెరీర్ నుంచి తప్పుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పాండ్యా వన్డేలను వదిలేసి, టీ20లకే పరిమితమయ్యే అవకాశం ఉందన్నారు.
భవిష్యత్తులో చాలా మంది ఆటగాళ్లు టీ20 ఫార్మాట్‌కే ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. వన్డేలు, టీ20ల కంటే టెస్ట్ క్రికెట్ చాలా ప్రత్యేకమైనందన్న రవిశాస్త్రీ.. టెస్ట్ క్రికెట్‌కు మాత్రం రోజురోజుకు ఆదరణ తగ్గుతుందన్నారు. ఆటగాళ్లు సైతం తాము ఏయే ఫార్మాట్లలో ఆడాలో వారే నిర్ణయించుకుంటున్నారని చెప్పారు. హార్ధిక్ విషయానికి వస్తే అతను టీ20 ఆడాలనుకుంటున్నట్లు రవిశాస్త్రి తెలిపారు. మరోవైపు, ఇటీవలే ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఎవరూ ఊహించని విధంగా వన్డేల నుంచి తప్పుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.