Gill Century: శుభ్మన్ గిల్ సెంచరీ, 200 పరుగులు దాటిన భారత్ స్కోర్
Gill Scored Century facing 194 balls
టీమిండియా బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీ సాధించాడు. ఆసీస్ జట్టుతో జరుగుతున్న నాల్గవ టెస్టులో అదరగొట్టాడు. 194 బంతులు ఎదుర్కొని శతకం పూర్తి చేసుకున్నాడు. గిల్ చేసిన ఈ సెంచరీ టెస్టుల్లో అతడికి రెండో సెంచరీ కావడం విశేషం. సెంచరీ పూర్తి చేసిన తర్వాత కూడా గిల్.. ఆసీస్ బౌలర్ల భరతం పడుతున్నాడు. ఎంతో ఓపికగా ఆడుతున్నాడు. ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులు చేసి ఔటవ్యవగా, చటేశ్వర పుజారా 42 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ కుహ్నేమాన్ బౌలింగ్ లో ఔటవ్వగా, పుజారా టాడ్ మర్ఫీ బౌలింగ్ లో ఔటయ్యాడు. 73 ఓవర్లు పూర్తయ్యే నాటికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 120 పరుగుల వద్ద, విరాట్ కోహ్లీ 17 పరుగుల వద్ద ఉన్నారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత బరిలో దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట రెండో రోజు ముగిసే నాటికి భారత జట్టు వికెట్లు కోల్పోకుండా 36 పరుగులు చేసింది. భారత స్కోర్ 74 పరుగులకు చేరుకున్న సమయంలో రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన పుజారా క్రీజులో పాతుకుపోయాడు. సహచర ఆటగాడు గిల్ కి జతకట్టాడు. మరో వికెట్ల పడకుండా జాగ్రత్తగా ఆడారు. పటిష్టమైన భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ సమయంలో భారత స్కోర్ 187 పరుగులకు చేరిన సమయంలో పుజారా ఔట్ అయ్యాడు.
200 up for #TeamIndia
Live – https://t.co/8DPghkwsO6 #INDvAUS @mastercardindia pic.twitter.com/WcF5J5ibZM
— BCCI (@BCCI) March 11, 2023